Header Banner

చంద్రబాబు కీలక వ్యూహం సిద్ధం! రేపు ఏపీ బడ్జెట్ 2025-2026!

  Thu Feb 27, 2025 15:50        Politics

ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపు (శుక్రవారం) అసెంబ్లీలో ప్రభుత్వం 2025-26 వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టనుంది. ఈ బడ్జెట్ లో కేటాయింపుల పైన కూటమి పార్టీల్లో భారీ అంచనాలు ఉన్నాయి. బడ్జెట్ తరువాత చంద్రబాబు పార్టీ నేతలతో కీలక భేటీకి నిర్ణయం తీసుకున్నారు. తాజా రాజకీయ సమీకరణాలు.. మారుతున్న లెక్కలు పైన చర్చించటంతో పాటుగా భవిష్యత్ కార్యాచరణ డిసైడ్ చేయనున్నారు. పథకాలకు చేసే కేటాయింపుల పైన ప్రజల్లోకి వెళ్లేలా పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేసేలా కొత్త యాక్షన్ ప్లాన్ ప్రకటించనున్నట్లు సమాచారం.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రజల ముందుకు తీసుకొస్తోంది. 2025-26 వార్షిక బడ్జెట్ ను ఆర్దిక మంత్రి పయ్యావుల రేపు (శుక్రవారం) అసెంబ్లీ లో ప్రవేశ పెట్టనున్నారు. ఆర్దికంగా కష్టాల్లో ఉన్న ఏపీ ప్రభుత్వం ఈ బడ్జెట్ లో చేసే ప్రతిపాదనల పైన ఆసక్తి నెలకొంది. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలకు ఈ బడ్జెట్ లో కేటాయింపులు చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే మే నెలలో తల్లికి వందనం, మూడు విడత ల్లో అన్నదాత సుఖీభవ అమలు దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పథకాలకు బడ్జెట్ లో కేటాయింపులు చేయటం ఖాయంగా కనిపిస్తోంది.

ఇది కూడా చదవండివల్లభనేని వంశీకి మరో షాక్.. పోలీసుల విచారణలో కీలక మలుపు! కోర్టు కఠిన నిర్ణయం!


బడ్జెట్ ముగిసిన తరువాత పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశం కావా లని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. అసెంబ్లీ కమిటీ హాల్ లో ఈ సమావేశం జరగ నుంది. తొమ్మిది నెలల కూటమి పాలనలో సాధించిన పురోగతి.. బడ్జెట్ లక్ష్యాల పైన ఈ భేటీలో చంద్రబాబు వివరించనున్నారు. ఆర్దికంగా కష్టాలు ఉన్నా.. సంక్షేమ పథకాలకు చేసిన కేటాయింపు ల గురించి ప్రజల్లోకి తీసుకెళ్లే అంశం పైన దిశా నిర్దేశం చేయనున్నారు. ఇక, తాజాగా చోటు చేసు కుంటున్న రాజకీయ పరిణామాలు.. సంఘటనల పైన చంద్రబాబు స్పందించే అవకాశం ఉంది. ప్రభుత్వం - పార్టీ సమన్వయంతో ముందుకు వెళ్లే అంశం పైన స్పష్టత ఇవ్వనున్నారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధుల విషయంతో తన ఆలోచనలను చంద్రబాబు వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. మిత్రపక్షాలకు రెండు స్థానాలు ఇవ్వాల్సి ఉండటంతో.. మూడు స్థానాలే టీడీపీకి దక్కే ఛాన్స్ ఉంది. దీంతో.. అభ్యర్ధుల ఖరారు .. భవిష్యత్ అవకాశాల పైన చంద్రబాబు క్లారిటీ ఇవ్వనున్నట్లు సమాచారం. క్షేత్ర స్థాయిలో మూడు పార్టీల సమన్వయం గురించి పార్టీ నేతలకు చంద్రబాబు నిర్దేశం చేస్తారని తెలుస్తోంది. ఈ ప్రత్యేక సమావేశానికి ఎంపీలను సైతం ఆహ్వానించటంతో చంద్రబాబు నిర్వహించే ఈ ప్రత్యేక భేటీ.. తీసుకునే నిర్ణయాల పైన పార్టీలోనూ ఆసక్తి కనిపిస్తోంది.


ఇది కూడా చదవండివైసీపీకి మరో బిగ్ షాక్.. కీలక నేతపై కేసు నమోదు! పోలీసుల దర్యాప్తు వేగవంతం!

మేం ఆంధ్రులం అనే భావనే లేదు.. ప్రజలకు కులాలే గుర్తు! పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు!


గ్రాడ్యుయేట్ ఓటు కోసం అది తప్పనిసరి.. లేకుంటే హక్కు కోల్పోతారు! ఎన్నికల్లో కీలక మార్పులు!


ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. యుద్ధం ముగియాలంటే అదొక్కటే మార్గం!

 

ప్రజలకు అప్డేట్.. ఆధార్ కార్డులో కొత్త మార్పు! ఇది తెలుసుకోకపోతే నీ పరిస్థితి ఇక అంతే!

 

ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త హైవేకు లైన్ క్లియర్! ఈ జిల్లాలకు మహర్దశ!

 

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Andhrapradesh #chandrababu #apbudget